Baba Ramdev | న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మరోమారు చిక్కుల్లో పడ్డారు. పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తి చేసే ఆయుర్వేద పళ్ల పొడి ‘దివ్య మంజన్’లో మాంసాహార ఆనవాళ్లు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు బాబా రాందేవ్, పతంజలి సంస్థకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
దివ్య మంజన్‌ను మొక్కల ఆధారిత ఆయుర్వేద ఉత్పత్తిగా ప్రచారం చేస్తుండడంతో తాను చాలాకాలంగా ఆ పౌడర్‌ను ఉపయోగిస్తున్నట్టు పిటిషనర్ అయిన అడ్వకేట్ యతిన్శర్మ తెలిపారు. అయితే, ఇందులో చేపల నుంచి తీసే ‘సుమద్రఫేన్’ (సేపియా అఫిసినాలిస్)ను ఉపయోగించినట్టు తాజా పరిశోధనలో వెల్లడైందని పేర్కొన్నారు. తమది పూర్తిగా శాకాహార కుటుంబమని ఈ విషయం తెలిశాక తనతోపాటు కుటుంబం కూడా తీవ్ర మనస్తాపానికి గురైందని పేర్కొన్నారు. కోర్టు విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది.