ఇండోర్, ఏప్రిల్ 13: దేశ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ గురువారం అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మధ్యప్రదేశ్ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల హక్కులు ప్రమాదంలో పడ్డాయని, వారికి ఓటేసే హక్కు ఉంటుందో, లేదోనన్న ప్రశ్న తలెత్తుతున్నదన్నారు.
డర్టీ డ్రెస్ వేసుకున్న మహిళలు శూర్పణఖలా కనిపిస్తారన్న బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ వర్గీయ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇవాళ దుస్తుల గురించి మాట్లాడిన వారు, రేపు సామాజిక మాధ్యమాల వాడకంపై నిషేధం విధించొచ్చని తెలిపారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.