Dog worship | అక్కడ వందేళ్లుగా కుక్కను పూజిస్తున్నారు.. ఎందుకంటే..!
Dog worship | కొద్ది మంది జంతు ప్రేమికులు తప్ప.. చాలామంది కుక్కలను చూస్తే చీదరించుకుంటారు. అవి దగ్గరికి రాబోతే దూరం వెళ్లగొడుతారు. కానీ వాళ్లు మాత్రం వందేళ్లుగా కుక్కను పూజిస్తున్నారు. ఇంతకూ ఎవరు వాళ్లు..? అని ఆలోచిస్తున్నారా..? అయితే అక్కడికే వస్తున్నా.
లక్నో: కొద్ది మంది జంతు ప్రేమికులు తప్ప.. చాలామంది కుక్కలను చూస్తే చీదరించుకుంటారు. అవి దగ్గరికి రాబోతే దూరం వెళ్లగొడుతారు. కానీ వాళ్లు మాత్రం వందేళ్లుగా కుక్కను పూజిస్తున్నారు. ఇంతకూ ఎవరు వాళ్లు..? అని ఆలోచిస్తున్నారా..? అయితే అక్కడికే వస్తున్నా. ఉత్తర్ప్రదేశ్లోగల ఒక బైరవుని ఆలయంలో ఈ శునక పూజలు జరుగుతున్నాయి. ఆ ఆలయంలోని శునకం విగ్రహాన్ని పూజించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆ శునకం విగ్రహం పాదాలకు నల్లదారం కట్టి ఏదైనా కోరుకుంటే అది జరిగి తీరుతుందని స్థానికులు బలంగా నమ్ముతారు.
శునకాన్ని ఎందుకు పూజిస్తున్నారు..?
దాదాపు 100 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్షెహర్లోని సికందరాబాద్లో బాబా లటూరియా అనే ఒక గురువు ఉండేవారు. మంచిచెడు అడిగేందుకు ఆయన దగ్గరికి చాలా మంది వస్తుండేవారు. ఆ క్రమంలోనే ఆయన ఆ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో ఉంటూ ఆయన ఒక కుక్కను పెంచుకున్నారు. ఆ కుక్కను ఆయన బైరవ్ బాబాగా పిలిచేవారు. స్థానికులకు కూడా అదే పిలుపు అలవాటైంది.
అయితే, తన చివరి రోజుల్లో బాబా లటూరియా తాను నిర్మించుకున్న గుడిలోనే సజీవ సమాధికి సిద్ధమయ్యారు. బాబా సమాధిలోకి వెళ్లిన తర్వాత ఆయన భక్తులు దాన్ని మూసివేస్తుండగా బైరవ్ అందులోకి దూకింది. వెంటనే బాబా భక్తులు దాన్ని బయటికి తీసి సమాధిని మూసేశారు. కానీ, ఆ తర్వాత కాసేపటికే బైరవ్ మరణించింది. దాంతో బైరవ్కు గుర్తుగా ఆ ఆలయంలో ఓ విగ్రహాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. ఏటా హోలీ, దీపావళి పండుగలకు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళ, శనివారాల్లో బైరవ్ దర్శనానికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

