భోపాల్: ప్రభుత్వ కాలేజీలో జరిగిన పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను ఒక ప్యూన్ మూల్యాంకనం చేశాడు. (Peon Caught Evaluating Answer Sheets) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్‌తోపాటు ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చింద్వారాలోని రాజా శంకర్ షా యూనివర్శిటీ నిర్వహించిన పరీక్షల మూల్యాంకానికి ప్రొఫెసర్ రామ్గులాం పటేల్‌ను నోడల్ అధికారిగా నియమించారు.
కాగా, పిపారియాకు చెందిన భగత్ సింగ్ ప్రభుత్వ కాలేజీ గెస్ట్ లెక్చరర్ తాను దిద్దాల్సిన సమాధాన పత్రాలను ప్యూన్‌కు అప్పగించాడు. దీంతో అతడు వాటిని మూల్యాంకనం చేశాడు. ఈ విషయం తెలిసి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఠాకూర్‌దాస్ నాగవంశీని కలిసి ఫిర్యాదు చేశారు. యువజన వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ ఈ అంశంపై స్పందించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న ఆ కాలేజీ ప్రిన్సిపాల్, నోడల్ అధికారిని సస్పెండ్ చేశారు. అయితే సమాధాన పత్రాలను కాలేజీ ప్యూన్ మూల్యాంకనం చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
📍Madhya Pradesh | #Watch: Peon Caught Evaluating Answer Sheets In MP, Principal Suspended
Read more: https://t.co/TUoudTjG5m pic.twitter.com/DDRAiJ3VIF
— NDTV (@ndtv) April 8, 2025