రెండేండ్ల తర్వాత తెరచుకున్న పెద్దపాదం
Shabarimala | శబరిమల అయ్యప్పస్వామి నేటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మండల పూజ ముగియడంతో డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేశారు. అయితే మకర విళక్కు కోసం ఆలయాన్ని గురువారం సాయంత్రం తెరిచారు

హైదరాబాద్: శబరిమల అయ్యప్పస్వామి నేటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మండల పూజ ముగియడంతో డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేశారు. అయితే మకర విళక్కు కోసం ఆలయాన్ని గురువారం సాయంత్రం తెరిచారు. దీంతో నేటి నుంచి అయ్యప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వచ్చే నెల 19 వరకు శబరిమల ఆలయం తెరిచి ఉండనుంది. ప్రతిరోజూ వేకువజామున 4 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులకు మణికంఠుని దర్శనభాగ్యం కలగనుంది. మళ్లీ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతించనున్నారు.
కరోనా నేపథ్యంలో మూతపడిన పెద్దపాదం రెండేండ్ల తర్వాత తెరచుకున్నది. ఆదివారం నుంచి పెద్దపాదం మార్గంలో భక్తులకు అనుమతించనున్నారు. నీలక్కల్, ఎరుమేలి వద్ద దర్శనం కోసం స్పాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. టికెట్ బుక్‌చేసుకున్న భక్తులు కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రం తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. హరివాసనం తర్వాత వచ్చే నెల 19న ఆలయాన్ని మూసివేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

