సబ్సిడీలు, సంక్షేమ పథకాల్లో కోత : పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బడ్జెట్‌కు మెరుగులు దిద్దినట్టు కనిపించిందని పెదవివిరిచాయ
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బడ్జెట్‌కు మెరుగులు దిద్దినట్టు కనిపించిందని పెదవివిరిచాయి. సామాన్యులకు ఆసరాగా నిలవాల్సింది పోయి వారికి అందించే సంక్షేమ పథకాలు, సబ్బిడీల్లో కోత విధించారని నిర్మల బడ్జెట్‌పై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
దారిద్ర్య రేఖ ఎగువకు చేరిన వారు సైతం మోదీ సర్కార్ నిర్వాకంతో తిరిగి దారిద్ర్య రేఖకు దిగువన పడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేండ్ల బడ్జెట్ల తరహాలోనే ప్రస్తుత బడ్జెట్ కూడా ఉందని పన్నులు పెంచారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై ఖర్చు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొద్దిమంది పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారులకు దోచిపెట్టేందుకు పన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పన్ను రాబడితో ప్రజలు బాగుపడాలి కానీ పన్నులతో ప్రజల వెన్ను విరుస్తున్నారని మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిర్మల బడ్జెట్‌పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, టీఎంసీ నేత శత్రుజ్ఞ సిన్హా సహా పలువురు విపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

