న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా రైలు, బస్సు టిక్కెట్ల కొనుగోలుపై పలు రాయితీలు అందిస్తున్నట్లు పేటీఎం తెలిపింది. పేటీఎమ్ ప్లాట్‌ఫాం ద్వారా బస్సు టిక్కెట్ల కొనుగోలుపై రూ.500 వరకు తగ్గింపును అందిస్తున్నట్లు వెల్లడించింది. పేటీఎం నుంచి రైలు టిక్కెట్టును కొనుగోలు చేసిన వాళ్లు తమ ప్రయాణ సమయానికి ఆరు గంటల ముందు టికెట్‌ను రద్దు చేసుకుంటే.. వారి ఖాతాలో టికెట్ కోసం చెల్లించిన నగదు పూర్తిగా జమ అవుతుందని తెలిపింది.
ఈ ఆఫర్ తత్కాల్ సహా అన్ని రకాల రైలు టిక్కెట్లకూ వర్తిస్తుందని పేటీఎం తెలిపింది. పేటీఎం ప్లాట్ఫామ్లో యూపీఐ ద్వారా రైలు టిక్కెట్ కోసం చెల్లింపులు జరిపినప్పుడు ఎలాంటి అదనపు రుసుములు ఉండవని పేటీఎం వెల్లడించింది.