మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 14, 2020 , 19:49:43

అమర జవాన్లకు అశ్రునివాళి..

అమర జవాన్లకు అశ్రునివాళి..

చండీఘడ్‌: సరిగ్గా ఏడాది క్రితం ఉగ్రదాడిలో అమరులైన భారత సైనికులకు యావత్‌ భారతావని శ్రద్ధాంజలి ఘటిస్తోంది. చండీఘడ్‌లో రైజింగ్‌ ఇండియా యూత్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు.. పంజాబ్‌ యూనివర్సిటీ వద్ద అమర జవాన్‌ లోగో తీర్చిదిద్ది, అక్కడ కొవ్వొత్తులు ఉంచి జవాన్లకు అశ్రునివాళి తెలియజేశారు. అమర జవాన్ల ఆత్మ శాంతిని కోరుతూ నినాదాలు చేశారు. మీ త్యాగం ఊరికేపోదనీ.. ప్రతీకారం తప్పకుండా ఉంటుందని వారు నినాదాలు చేశారు. పోయినేడాది ఫిబ్రవరి 14న సాయంత్రం పుల్వామాలో భారత సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు  ప్రయాణిస్తున్న బస్సును ఓ ఉగ్రవాది భారీ మందుగుండు సామాగ్రితో ఉన్న జీపుతో ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా బాంబులు పేలి బస్సులో ఉన్న 40 మంది జవాన్లు అమరులయ్యారు.

ఈ ఘటనతో భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశరక్షణలో ప్రాణాలర్పించిన జవాన్లకు దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, టౌన్లలోని తదితర సంస్థల వద్ద ప్రజలు.. కొవ్వొత్తులు, పుష్పగుచ్చాలు ఉంచి, అమరులైన సైనికులకు నివాళులు అర్పిస్తున్నారు. జవాన్లు మరణించిన ఈరోజు దేశానికి చీకటిదినంగా దేశప్రజలు భావిస్తున్నారు. వారి సేవలు తలుచుకుంటూ.. జై జవాన్‌ అంటూ నినదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో అమర వీరుల స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. స్మృతి చిహ్నం వద్ద సైనికులు, అధికారులు పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు.


logo