ముంబై : మహారాష్ట్రలో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎంవీఏ కూటమి మూడు, విపక్ష బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందాయి. క్రమంలో ఎన్నికల ఫలితాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ స్పందించారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్వతంత్ర ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నారని, దీంతోనే ఫలితంలో తేడా వచ్చిందన్నారు. కానీ, అది ప్రభుత్వ స్థిరాత్వాన్ని ప్రభావితం చేయదన్నారు.
ఫలితం తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎంవీఏ కూటమి సాహసోపేతమైన ప్రయత్నం చేసిందన్నారు. చిన్న పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను బీజేపీ వైపు మళ్లించడంలో ఫడ్నవీస్ అద్భుతంగా వ్యవహరించారన్నారు. అలాగే.. ఫలితాలపై ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. బీజేపీ పనితీరును అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. మా ఓటమిని అంగీకరిస్తున్నామని, తప్పుడు ఎక్కడ జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.