శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 14:31:26

ప‌వ‌న్ గుప్తా క్ష‌మాభిక్ష పిటిష‌న్ తిర‌స్క‌రించిన రాష్ట్ర‌ప‌తి

ప‌వ‌న్ గుప్తా క్ష‌మాభిక్ష పిటిష‌న్ తిర‌స్క‌రించిన రాష్ట్ర‌ప‌తి

హైద‌రాబాద్‌: నిర్భ‌య దోషుల్లో ఒక‌రైన ప‌వ‌న్ గుప్తా క్ష‌మాభిక్ష పిటిష‌న్‌ను ఇవాళ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తిర‌స్క‌రించారు. నిర్భ‌య అత్యాచార కేసులో న‌లుగురికి ఉరిశిక్ష ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు దోషులు.. రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద‌ క్ష‌మాభిక్ష పిటిష‌న్ పెట్టుకున్నారు. వాస్త‌వానికి ఢిల్లీ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ ప్రకారం ఈనెల 3వ తేదీన నిర్భ‌య దోషుల‌ను ఉరి తీయాల్సి ఉండే. కానీ ప‌వ‌న్ పిటిష‌న్ పెండింగ్‌లో ఉన్న కార‌ణంగా.. ఉరిశిక్ష అమ‌లును వాయిదా వేశారు. అక్ష‌య్ థాకూర్‌, విన‌య్ శ‌ర్మ‌, ముకేశ్ సింగ్‌.. ఈ కేసులో ఉరిశిక్ష‌ను ఎదుర్కొంటున్నారు.   


logo