Pawan express | విరిగిన చక్రంతో 10 కి.మీ వెళ్లిన రైలు.. ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
Pawan express | బీహార్ (Bihar) లో ఓ రైలు (train)కు పెను ప్రమాదం తప్పింది. ముంబై వెళ్తున్న పవన్ ఎక్స్ ప్రెస్ (Pawan express) రైలు ఎస్ 11 బోగీలోని ఓ చక్రం దెబ్బతినింది.
Pawan express | బీహార్ (Bihar) లో ఓ రైలు (train)కు పెను ప్రమాదం తప్పింది. ముంబై వెళ్తున్న పవన్ ఎక్స్ ప్రెస్ (Pawan express) రైలు ఎస్ 11 బోగీలోని ఓ చక్రం దెబ్బతినింది. ఇది గమనించని డ్రైవర్ రైలును అలాగే 10 కిలోమీటర్లు పోనిచ్చాడు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ముజఫర్ పూర్ – హాజీ పూర్ రైల్వే సెక్షన్ మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ముజఫర్ స్టేషన్ నుంచి పవన్ ఎక్స్ ప్రెస్ ఆదివారం రాత్రి ముంబైకి బయలు దేరింది. ఆ తర్వాత రైలులోని ఎస్-11 బోగీ నుంచి పెద్ద శబ్దాలు వచ్చాయి. అవి విన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత రైలు పది కిలోమీటర్లు అలాగే వేగంగా ముందుకు వెళ్లింది. రైలు భగవాన్ పూర్ (Bhagwanpur) రైల్వే స్టేషన్ కు చేరుకోగానే కొందరు ప్రయాణికులు చైన్ లాగి.. శబ్దాల గురించి స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ కోచ్ ను పరిశీలించి రైలు చక్రం విరిగిపోవడాన్ని గుర్తించారు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టినట్లు ఉత్తర మధ్య రైల్వే సీపీఆర్ వో బీరేంద్ర కుమార్ తెలిపారు. ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.
Also Read..
Sharad Pawar | కుటుంబంలో సమస్యలు లేవు.. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకూ ఆటంకం లేదు : ఎన్సీపీ చీలికపై పవార్
Madhya Pradesh | మహిళ అనుమానాస్పద మృతి.. మృతదేహాన్ని రెండు రోజులుగా ఫ్రీజర్లోనే పెట్టిన భర్త..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

