Israel : న్యూయార్క్ మేయర్ (Newyork Mayor) జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ (Israel) తీవ్రంగా స్పందించింది. ఐక్యరాజ్యసమితి (UNO) లో ఇజ్రాయెల్ రాయబారి (Israel Envoy) డానీ డానన్ (Danny Danon) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మామ్దానీకి కౌంటర్ ఇచ్చారు. న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న యూదు వ్యతిరేకతను (యాంటీ సెమిటిజం) అరికట్టడం చేతకాని మేయర్.. కేవలం హెడ్‌లైన్స్‌లో నిలవడం కోసం ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్నారని విమర్శించారు. మేయర్ బెదిరింపులవల్ల ఏమీ మారదని అన్నారు.
ప్రధాని నెతన్యాహు సగర్వంగా న్యూయార్క్ వస్తారని, ఐరాసలో ఇజ్రాయెల్ తరఫున తన గళం విప్పుతారని డానీ డానన్ స్పష్టంచేశారు. ఈ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వస్తే.. మొదట మేయర్ జోహ్రాన్ మామ్దానీనే అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఒక రేడియో షోలో నెతన్యాహు మాట్లాడుతూ.. మేయర్ మామ్దానీ హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారని, ఆయన మనసులో అమెరికాపై తీవ్ర ద్వేషం దాగి ఉందని ఆరోపించారు.
కాగా శనివారం ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఇచ్చిన ఇంటర్వ్యూలో మేయర్ మాట్లాడుతూ.. నెతన్యాహును ఒక యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆయనపై మోపిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ది హేగ్‌లోని జైలుకు వెళ్లాల్సిన వ్యక్తి అన్నారు. న్యూయార్క్‌కు వస్తే ఆయనను అరెస్ట్ చేస్తామని చెప్పారు.