తిరుమల : భక్త రక్షకుడు.. నిత్యకల్యాణుడు కొలువుదీరిన తిరుమల ( Tirumala) వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
శనివారం స్వామివారిని 74,096 మంది భక్తులు దర్శించుకోగా 36,562 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.66 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. భక్తులకు నాలుగు లక్షల లడ్డూలను విక్రయించామని, 2.96 లక్షల మందికి అన్న ప్రసాదం అందజేశామని వెల్లడించారు.