Netanyahu | న్యూయార్క్‌లో అడుగుపెడితే నెతన్యాహును అరెస్ట్ చేస్తాం : న్యూయార్క్ మేయర్
Netanyahu | ఐక్యరాజ్యసమితి సదస్సు (UNO Summit) కోసం నగరానికి వస్తున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి (Israel Prime Minister) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) ను అరెస్ట్ చేస్తామని న్యూయార్క్ నగర మేయర్ (Newyork Mayor) జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Netanyahu : ఐక్యరాజ్యసమితి సదస్సు (UNO Summit) కోసం నగరానికి వస్తున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి (Israel Prime Minister) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) ను అరెస్ట్ చేస్తామని న్యూయార్క్ నగర మేయర్ (Newyork Mayor) జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. శనివారం ‘ది న్యూయార్క్ టైమ్స్ (The Newyork Times)’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేయర్ మాట్లాడుతూ.. నెతన్యాహును ఒక యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఆయనపై మోపిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ది హేగ్‌లోని జైలుకు వెళ్లాల్సిన వ్యక్తి అని అన్నారు.
ఇప్పుడే కాదు న్యూయార్క్ మేయర్ ఎన్నికలప్పుడు తన ఎన్నికల ప్రచారంలో కూడా నెతన్యాహును అరెస్ట్ చేస్తానని మామ్దానీ హామీ ఇచ్చారు. అయితే ఒక విదేశీ దేశాధినేతను అరెస్ట్ చేసే అధికారం నగర మేయర్‌కు ఉందా.. లేదా..? అనే అంశంపై తాము ప్రస్తుతం నగర న్యాయ సలహాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. న్యూయార్క్ నగర చట్టాలు తనకు ఏ మేరకు అనుమతి ఇస్తే.. ఆ మేరకు చర్యలు తీసుకోవడానికి తాను వెనుకాడనని మామ్దానీ తేల్చిచెప్పారు.
గత కొన్నేళ్లుగా నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలవల్లే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

