Bihar | బీహార్ (Bihar) ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court)లో గట్టి షాక్ తగిలింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు తాజాగా రద్దు చేసింది.
గతేడాది బీహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచిన విషయం తెలిసిందే (increase quota for backward classes). రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పాట్నా హైకోర్టు.. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపును రద్దు చేసింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు నిచ్చింది.
Also Read..
Toxic Alcohol | 34కి చేరిన నాటు సారా మృతులు.. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్
Delhi Heatwave | అగ్నిగుండంలా ఢిల్లీ.. వడగాడ్పులకు తొమ్మిది రోజుల్లో 192 మంది నిరాశ్రయులు మృత్యువాత
Hajj pilgrims | మక్కాలో తీవ్రమైన వేడి.. మృతిచెందిన హజ్ యాత్రికుల్లో 90 మంది భారతీయులే..?