పాట్నా, జూలై 31 : ఇటీవలి కాలంలో వరుస హత్యలు, నేరాలతో అట్టుడుకుతున్న ఎన్డీయే పాలిత బీహార్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రాజధాని పాట్నాలోని ఎయిమ్స్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న దంపతుల ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు వారి ఇద్దరి పిల్లలను సజీవ దహనం చేశారు.
పాట్నాలో ఎయిమ్స్‌లో శోభాదేవి, లలన్ కుమార్ గుప్తాలు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. గురువారం జానిపూర్ ప్రాంతంలో ఉన్న వారి ఇంట్లోకి పట్టపగలు ప్రవేశించిన కొందరు దుండగులు అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన వారి పిల్లలు అంజలి, అన్షులను సజీవంగా దహనం చేశారు.