అయోధ్య, డిసెంబర్ 31: అయోధ్య నగరం అన్నది సహనానికి మారుపేరని, అన్ని సందర్భాలలోనూ అది అతిథులను ఘనంగా ఆహ్వానిస్తుందని అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసులో ఫిర్యాదుదారైన ఇబ్బాల్ అన్సారీ అన్నారు. జనవరి 22న అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని స్థానికుడైన అన్సారీ మీడియాతో మాట్లాడారు. అయోధ్యపై 2019 నాటి సుప్రీం కోర్టును ముస్లిం వర్గం గౌరవిస్తుందని చెప్పారు.