E-Passport | దేశంలో పాస్‌పోర్ట్ సేవల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్పీ) వెర్షన్ 2.0లో భాగంగా ఈ-పాస్‌పోర్ట్ (E-Passport)ను ప్రవేశపెట్టింది. పాస్‌పోర్ట్‌ల భద్రతను మెరుగుపరచడం, ఇంటర్నేషనల్ ప్రయాణాలను స్ట్రీమ్‌లైన్ చేయడం, నకిలీ, ట్యాంపరింగ్ నుంచి పాస్‌పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత డాటాను సంరక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్టుగా కొద్ది నగరాలకే పరిమితమైన ‘ఈ-పాస్‌పోర్ట్’ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ‘పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్పీ) 2.0’ (Passport Seva 2.0) కింద ఈ అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) గతవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానం ప్రయాణికులకు పూర్తిస్థాయి డిజిటల్ ఇండియా అనుభూతిని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఏమిటీ ఈ-పాప్‌పోర్ట్?
ఇది సంప్రదాయ పేపర్ డాక్యుమెంట్ వంటిదే. ఈ-పాస్‌పోర్ట్ కవర్‌పై బంగారు వర్ణపు చిన్న సింబల్ ఉంటుంది. సంప్రదాయ పాస్‌పోర్ట్‌లకు భిన్నంగా ఇందులో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీతో ఈ-పాస్‌పోర్ట్ అనుసంధానమై ఉంటుంది. పాస్‌పోర్ట్ కవర్లో చిప్, యాంటెన్నా పొందుపరిచి ఉంటాయి. ఈ చిప్‌లోనే పాస్‌పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత, బయోమెట్రిక్ డాటా తదితర కీలకమైన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. తద్వారా అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో అథెంటికేషన్ సులభతరం అవుతుంది.
ఈ-పాస్‌పోర్ట్ వల్ల లాభాలు
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
Also Read..
India-US | షరతులకు రెండు దేశాలూ ఓకే.. జులై 8 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకటన..!
Artificial Rain | ఢిల్లీలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు.. ఎప్పుడు..? ఎందుకంటే..?
Char Dham Yatra | చార్ధామ్ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత