న్యూఢిల్లీ: అన్ని వర్గాల ప్రయాణికులకు కలిపి భారతీయ రైల్వే ప్రతి ఏడాది రూ. 56,993 కోట్లను టికెట్లపై రాయితీగా అందిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ బుధవారం తెలిపారు. ప్రతీ టికెట్‌పైనా 46 శాతం రిబేటు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టికెట్ ధర రూ.100 అనుకుంటే అందులో రూ.54 మాత్రమే ప్రయాణికుల నుంచి వసూలు చేసి మిగతా రూ.46ను రాయితీ ఇస్తున్నట్టు వివరించారు.