Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని రాణిపేట జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అరక్కోణం – కాట్పాడి మెమూ ప్యాసింజర్ చిత్తేరి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. చిత్తేరి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరిన కాసేపటికే రైలు పట్టాలు తప్పిందన్నారు. అప్రమత్తమైన లోకో పైలట్‌ను రైలును ఆకస్మాత్తుగా నిలిపివేశారు.
రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొంత మంది ప్రయాణికులు రైల్లో నుంచి దూకి పరుగులు తీశారు. అరక్కోణం – కాట్పాడి ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.