పాట్నా: వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న బీహార్లో అధికార జేడీయూ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, పలువురు ఆశావహులు పాట్నాలోని సీఎం నితీశ్ కుమార్ అధికార నివాసం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నితీశ్ కుమార్ ఇంటి వద్ద పెద్దయెత్తున మోహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులు లోపలికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో పలువురు నేతలు ఇంటి బయట బైఠాయించి నిరసన తెలిపారు.