న్యూఢిల్లీ, అక్టోబర్ 26: నిర్లక్ష్యంగా కారణంగా మరణాలు సంభవించే ఘటనల్లో దోషులకు విధించే శిక్ష రెండేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ భావిస్తున్నది. ఈమేరకు కమిటీ సిఫారసు చేయనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
క్రిమినల్ చట్టాల్ని సమూలంగా మార్చేస్తూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం మూడు కొత్త బిల్లుల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు హిందీలో కాకుండా ఇంగ్లిష్ పేర్లను నిర్ణయించాలని కమిటీలోని విపక్ష పార్టీల సభ్యులు కోరగా, దీనిని కమిటీ కొట్టిపారేసింది.