షెడ్యూల్ కంటే ముందే పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా
Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ముందే ముగిశాయి. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ముందే ముగిశాయి. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను సభాపతులు నిరవధికంగా వాయిదా వేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో.. షెడ్యూల్ కంటే ముందే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ముగించాలని నిర్ణయించారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 వరకు పార్లమెంట్ వింటర్ సెషన్ కొనసాగాల్సి ఉండగా.. ఈ నెల 23ననే సెషన్‌ను ముగించాలని బీఏసీలో డిసైడ్ చేశారు. ఆ మేరకు ఇవాళ లోక్‌సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఈ నెల 7న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి.
అయితే, డిసెంబర్ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. అదే అంశంపై పార్లమెంట్ ఉభయసభలు దద్ధరిల్లాయి. ఘటనపై ప్రభుత్వం ఉభయసభల్లో ప్రకటనలు చేసి చేతులు దులుపుకోగా.. ప్రతిపక్షాలు మాత్రం సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టాయి. ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడంతో నిత్యం రభస కొనసాగింది. చివరికి ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

