న్యూఢిల్లీ: కాలం చెల్లిన చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. జీవనం, వ్యాపారం సులువుగా సాగేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా 76 అనవసర చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 65 చట్టాల రద్దు కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులో రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లును ప్రవేశపెట్టింది.
కానీ ఇది చర్చకు రాలేదు. దీంతో మరో 11 చట్టాలను దీనిలో కలుపుతూ రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు, 2023ని ప్రవేశపెట్టింది. తాజాగా రాజ్యసభ బుధవారం ఆమోదించింది. దీంతో ల్యాండ్ అక్విజిషన్ (మైన్స్) యాక్ట్, 1885; టెలిగ్రాఫ్ వైర్స్ (అన్‌లాఫుల్ పొజెషన్) యాక్ట్, 1950 వంటి చట్టాలు రద్దయ్యాయి.