న్యూఢిల్లీ : శిరోమణి అకాలీ దళ్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మొహాలీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో బాదల్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని స్పష్టం చేశారు.
అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ప్రకాశ్ సింగ్ బాదల్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ గ్యాస్ట్రిక్ సమస్యలతో జూన్ 6వ తేదీన చండీఘర్‌లోని పీజీఐఎంఈఆర్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆయనను డిశ్చార్జి చేశారు. గతంలో బాదల్ కొవిడ్ బారిన కూడా పడ్డారు. పంజాబ్‌కు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు ప్రకాశ్ సింగ్ బాదల్.
Praying for the good health and speedy recovery of Shri Parkash Singh Badal Ji.
— Narendra Modi (@narendramodi) June 12, 2022