హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం యత్నిస్తున్న యువత కోసం హాస్లే హైవ్ రూపొందించిన ఏఐ ప్లాట్‌ఫామ్ ఇండియా కార్యాలయాన్ని హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా విద్య, ఉద్యోగాల కల్పనలో హాస్లే హైవ్ విద్యార్థులకు సహాయపడనున్నది.
ప్రస్తుతం అమెరికాలో ఓపీటీ కింద ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న, హెచ్ఐబీ వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ ఏఐ ప్లాట్‌ఫామ్ సేవలను అందిస్తున్నది. నామామాత్రపు సబ్స్క్రిప్షన్ ఫీజుతో నమోదు చేసుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. ఇప్పటివరకు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన హాస్లే హైవ్ ఇకపై ఇండియాలో సేవలను విస్తరించాలని నిర్ణయించి హైదరాబాద్‌లో ఆఫీసును ఏర్పాటు చేసింది. సమీప భవిష్యత్తులో ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, జర్మనీ, యూకే లాంటి దేశాల్లో సేవలందిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.