బెంగళూరు, జనవరి 7: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ మరో మాడల్‌ను పరిచయం చేసింది. ఏథర్ 450 ఎక్స్, 450 అపెక్స్ పేర్లతో విడుదల చేసిన ఈ స్కూటర్ ధర రూ.1.48 లక్షలుగా నిర్ణయించింది.
ఈ ధరలు బెంగళూరు షోరూంనకు సంబంధించినవి. ఇన్ఫినిటీ క్రూజర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన ఈ స్కూటర్ గరిష్ఠ వేగాన్ని నియంత్రించనున్నది. గంటకు 10 కిలోమీటర్ల వేగం నుంచి 90 కిలోమీటర్ల వేగం లోపు ఇన్ఫినిటీ క్రూజర్ ఆపరేటింగ్ చేయనున్నది.