గువాహటి: బీజేపీ పాలిత అస్సాం లో 11వ తరగతి పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. దీంతో ప్రభుత్వం పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. ఈ నెల 24 నుంచి ఈ నెల 29 వరకు జరిగే మొత్తం 36 సబ్జెక్టుల పరీక్షలన్నిటినీ రద్దు చేసినట్లు విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు చెప్పారు.
దీనిపై విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, ఎస్‌ఎంఎస్‌ఎస్, ఏఏఎస్‌యూ స్పందిస్తూ, అస్సాం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. విద్యా శాఖ మంత్రి పెగు తన పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర పాఠశాల విద్యా మండలి చీఫ్ ఆర్సీ జైన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి.