నోయిడా: అదనపు కట్నం కోసం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను తన తల్లిదండ్రులతో కలిసి ఆమె భర్త సజీవ దహనం (Noida Dowry Murder) చేశారు. అయితే నాన్నే అమ్మను లైటర్‌తో కాల్చి చంపాడని వారి ఆరేండ్ల కుమారుడు వెల్లడించాడు. తన కళ్ల ముందే నాన్న, నానమ్మ కలిసి అమ్మను తీవ్రంగా కొట్టారని, అనంతరం కిందపడేసి మండే స్వభావం ఉన్న ఒక పదార్థాన్ని ఆమెపై పోశారని, లైటర్‌తో ఆమెకు నిప్పంటించారని బాలుడు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, మృతురాలిని నిక్కీగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్తను ఇప్పటికే అరెస్టు చేయగా, పరారీలో ఉన్న అత్తమామలను గాలిస్తున్నారు.
బాధితురాలి సోదరి కాంచన్ మాట్లాడుతూ.. తాను, నిక్కీ ఇద్దరం ఒకే కుటుంబానికి చెందిన సోదరులను వివాహం చేసుకున్నాం. తాను రోహిత్‌ను వివాహం చేసుకోగా, నిక్కీ డిసెంబర్ 2016లో విపిన్‌ను పెండ్లి చేసుకుంది. వివాహం జరిగిన నాటి నుంచే తమ అత్తమామలు నిక్కీని వరకట్నం కోసం వేధించేవారు. కట్నంగా రూ.35 లక్షల తీసుకురావాలని చిత్రహింసలకు గురించేశారు. దీంతో వారికి కారు కోనిచ్చాం. అయితే వారి డిమాండ్ నెరవేరకపోవడంతో వేధింపులు కొనసాగించారు. ఈ క్రమంలో ఆగస్టు 21న కుటుంబ సభ్యులతో కలిసి ఆమె భర్త నిక్కీని దారుణంగా కొట్టారు. మెడపై దాడి చేయడంతో నిక్కీ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై ఆసీడ్ పోసి నిప్పంటించారు. తాము కూడా అదే ఇంట్లో ఉంటున్నాం, కానీ ఏమీ చేయలేకపోయాం. స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లాం. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స ఢిల్లీకి తరలించాం. అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని ఆ వీడియోలో వెల్లడించింది.
A 26-year-old woman in Greater Noida’s Sirsa village was allegedly beaten and set ablaze by her husband and in-laws over dowry demands, despite having been given a Scorpio SUV and valuables at the time of marriage. Her sister alleged the family demanded an additional ₹36 lakh.… pic.twitter.com/K4YZRsWBxT
— Mid Day (@mid_day) August 24, 2025