భువనేశ్వర్ : ఒడిశా తీరంలో పనామాకు చెందిన సరుకు రవాణా నౌక ఎంవీ ఓషన్ విన్నర్ మునిగిపోయింది. ఈ ఘటనలో అందులో ఉన్న 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు. నౌక సింగపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నౌకతో శనివారం కమ్యూనికేషన్ తెగిపోయినట్టు నౌకాయాన సహాయ, సమన్వయ కేంద్రం తెలిపింది. పారదీప్‌కు 240 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే భారత నౌకా దళ గస్తీ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ఇద్దరిని వారు రక్షించారు. ఈ నౌక ఇనుప ఖనిజంతో శుక్రవారం ఒడిశా నుంచి బయలుదేరినట్టు అధికారులు తెలిపారు.