Pamela Chopra: యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా కన్నుమూత
Pamela Chopra: నిర్మాత, సింగర్ పమేలా చోప్రా కన్నుమూశారు. ప్రఖ్యాత నిర్మా యశ్ చోప్రా భార్యే పమేలా. కబీ కబీ, నూరీ, సిల్సిలా లాంటి చిత్రాలకు ఆమె పనిచేశారు. యశ్ నిర్మాణంలో వచ్చిన చాలా సినిమాలను ఆమె కో ప్రొడ్యూస్ చేశారు.
న్యూఢిల్లీ: ప్రఖ్యాత సినీ నిర్మాత యశ్ చోప్రా భార్య .. నిర్మాత, సింగర్ పమేలా చోప్రా(Pamela Chopra) కన్నుమూశారు. ఆమె వయసు 85 ఏళ్లు. బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్ తన ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలిపారు. పమేలా చోప్రా గొప్ప మహిళ అని, చాలా తెలివైందని, విద్యావేత్త అని, ఎప్పుడూ నవ్విస్తూ ఉంటుందని జావెద్ అక్తర్ తెలిపారు. ఆమె కుమారుడు ఆదిత్య చోప్రా ప్రస్తుతం ఫిల్మ్‌మేకర్‌గా ఉన్నారు. మరో కుమారుడు ఉదయ్ చోప్రా యాక్టింగ్‌లో ఉన్నారు. నటి రాణీ ముఖర్జీని ఆదిత్య చోప్రా పెళ్లాడాడు.
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పమేలా చోప్రా .. సింగర్, రైటర్, డ్రెస్ డిజైనర్‌గా చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో చాలా వరకు ఆమె కో ప్రొడ్యూస్ చేశారు. ఇటీవల ఆమె నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నటించింది. యశ్ చోప్రా 2012లో మృతిచెందారు. పమేలా, యశ్ చోప్రాలు 1970లో పెళ్లి చేసుకున్నారు.
కబీ కబీ, నూరీ, కలా పత్తర్, సిల్సిలా, చాందినీ, దిల్వాలే దుల్హనియా లే జాయింగే, ముజ్సే దోస్తీ కరోగీ లాంటి చిత్రాల్లో పమేలా చోప్రా పాటలు పాడారు. కబీ కబీ చిత్రానికి రైటర్‌గా చేశారు. దిల్‌తో పాగల్ హై సినిమాకు సహ రచయితగా ఉన్నారు. సిల్ సిలా, సవాల్ చిత్రాలకు డ్రెస్ డిజైనర్‌గా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

