రాహుల్, కేజ్రీవాల్‌కు పాక్ మద్దతుపై దర్యాప్తు చేయాలి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు పాకిస్థాన్ మాజీ మం త్రి చౌధరి ఫవాద్ హుస్సేన్ నుంచి ప్రశంసలు, మద్దతు రావడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దర్యా ప్తు చేయాల్సిన అవసరం ఉన్నదని సోమవారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
- ఇది చాలా తీవ్ర అంశం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు పాకిస్థాన్ మాజీ మం త్రి చౌధరి ఫవాద్ హుస్సేన్ నుంచి ప్రశంసలు, మద్దతు రావడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దర్యా ప్తు చేయాల్సిన అవసరం ఉన్నదని సోమవారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘కొంత మంది వ్యక్తులకు మనకు వ్యతిరేకంగా శత్రుత్వాన్ని కలిగివున్న పాకిస్థాన్ నుంచి మద్దతు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇది ఆందోళన కలిగించే అంశం’ అని అభిప్రాయపడ్డారు. భారతీయ ఓటర్లు పరిపక్వత చెందిన వాళ్లని, సరిహద్దుల వెంబడి నుంచి వచ్చే స్టేట్మెంట్లు భారత్‌లో ఎన్నికలపై ప్రభావం చూపలేవని మోదీ అన్నారు. పాక్ నేత హుస్సేన్ ఈనెల మొదట్లో రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ పెట్టిన ఓ పోస్టు చర్చనీయాంశమైంది. అలాగే జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలపై ఆయన గత శనివారం చేసిన పోస్టు హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ‘మోదీజీ మరో యుద్ధంలో ఓడిపోయారు. కేజ్రీవాల్ విడుదల అయ్యారు. ఇది భారతదేశానికి శుభవార్త’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. విద్వేష, అతివాద శక్తులను శాంతి, సామరస్యం ఓడించాలని కోరుకుంటున్నానని మరో పోస్టులో పేర్కొన్నారు. హుస్సేన్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ ఖండించారు. తమ దేశ సమస్యలను పరిష్కరించుకొనే సామర్థ్యం తమకు ఉన్నదని, ముందు మీ దేశం దుస్థితిని చూసుకోండి అంటూ పాక్ నేతకు కౌంటర్ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

