Pakistani Intruder Arrested | అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో.. పాక్ చొరబాటుదారుడు అరెస్ట్
Pakistani Intruder Arrested | పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతలో భద్రతా దళాలు అతడ్ని గుర్తించాయి. పాక్ చొరబాటుదారుడ్ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఎందుకు చొరబడ్డాడు అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనగర్: పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతలో భద్రతా దళాలు అతడ్ని గుర్తించాయి. పాక్ చొరబాటుదారుడ్ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఎందుకు చొరబడ్డాడు అన్నది దర్యాప్తు చేస్తున్నారు. (Pakistani Intruder Arrested) గురువారం ఉదయం జమ్మూలోని కనాచక్ సెక్టార్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్ జాతీయుడైన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది గుర్తించారు. సరిహద్దులోని సున్నిత ప్రాంతమైన సోహన్ బోర్డర్ అవుట్‌పోస్ట్ (బీవోపీ) ఫార్వర్డ్ ఏరియాలో గస్తీ విధుల్లో అప్రమత్తంగా ఉన్న 44వ బెటాలియన్ దళాలు పాక్ చొరబాటుదారుడిని పట్టుకున్నాయి.
కాగా, జమ్మూలోని కనాచక్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న పాకిస్థాన్‌లోని సియాల్కోట్ జిల్లా లూని గ్రామానికి చెందిన నజీర్‌గా ఆ చొరబాటుదారుడిని గుర్తించారు. బీఎస్ఎఫ్ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ జాతీయుడు పొరపాటున సరిహద్దు దాటి వచ్చాడా? లేక భవిష్యత్తులో ఉగ్రవాదులను సరిహద్దులోకి పంపేందుకు సైనికుల అప్రమత్తతను పరీక్షించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించడా? లేక ఇతర కారణాలున్నాయా? అన్నది తెలుసుకునేందుకు నజీర్‌ను ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న కనాచక్ సెక్టార్ డీఐజీ కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్థాన్ వ్యక్తి చొరబాటు గురించి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

