న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌పై మరోసారి విషాన్ని కక్కింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన నేపథ్యంలో శనివారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్ టీఆర్ఎఫ్ పూర్తిగా సమర్థిస్తున్నట్టు ప్రకటించారు. పహల్గాం ఘటనలో 26 మందిని టీఆర్ఎఫ్ను బలి గొన్నట్టుగా ఏమైనా రుజువులు ఉన్నాయా అని ప్రశ్నించారు.
ఉంటే చూపించాలని భారత్‌తో సహా అమెరికాను కోరుతున్నట్టు తెలిపారు. అమెరికా టీఆర్ఎఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా పరిగణించడాన్ని ఆయన తప్పుబట్టారు.