న్యూఢిల్లీ, : సింధూ జలాల నిలిపివేతపై తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలన చేయాలంటూ పాకిస్థాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ భారత్కు విజ్ఞప్తి చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సింధూ జలాల నిలిపివేత కారణంగా తమ దేశంలో నీటి సంక్షోభం ఏర్పడుతుందని భారత విదేశాంగ శాఖకు ఆ దేశ జల వనరుల శాఖ ఒక లేఖ రాసింది.
ఈ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుని, యథావిధిగా పాక్కు నీటిని వదలాలని కోరింది. కాగా, సింధూ జలాలు పాక్కు చేరకుండా భారత్ ఇప్పటికే స్వల్ప, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలను ప్రకటించింది.