న్యూఢిల్లీ : సైనికులు ప్రయాణించే రైళ్ల వివరాలను పాకిస్థాన్ నిఘా వర్గాలు తెలుసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇది రహస్య సమాచారమని, దీనిని అనధికారిక వ్యక్తులకు తెలియజేయవద్దని రైల్వే ఉద్యోగులను హెచ్చరించింది.
ఈ సమాచారాన్ని బయటపెట్టడం వల్ల దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని చెప్పింది. ఈ నెల 6న ఈ మేరకు ఓ అడ్వయిజరీని జారీ చేసింది. రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్లకు ఈ సందేశాన్ని పంపించింది. రైల్వేలోని సైనిక విభాగం ‘మిల్ రైల్’కు మినహా ఇతరులకు ఈ సమాచారాన్ని ఇవ్వవద్దని స్పష్టం చేసింది.