ఇస్లామాబాద్ : లతా మంగేష్కర్ సాంగ్ మేరా దిల్ యే పుకారే ఆజాకు తనదైన స్టెప్స్‌తో ఇంటర్నెట్ను షేక్ చేసిన పాక్ బాలిక ఆయేషా మరోసారి అదరగొట్టే డ్యాన్స్ మూమెంట్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది. లేటెస్ట్ వీడియోలో ఆయేషా బటియాన్ భుజై రక్ది అనే సాంగ్‌కు కిల్లర్ మూమెంట్స్‌తో ఆయేషా దుమ్మురేపింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలె బైదాని ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 80 లక్షలు పైగా వ్యూస్ లభించాయి. తాజా వీడియోలోనూ వెడ్డింగ్ వేడుకలో ధరించిన సేమ్ సల్వార్ సూట్లో కనిపించిన ఆయేషా తనదైన సిగ్నేచర్ స్టెప్స్‌తో ఆకట్టుకుంది. ఇక మేరా దిల్ యే పుకారె ఆజా సాంగ్‌కు డ్యాన్స్ చేసిన ఆయేషా రాత్రికిరాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే.