న్యూఢిల్లీ : భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 18 వరకు మాత్రమే అమలులో ఉంటుందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ శుక్రవారం వెల్లడించారు. ఇరు దేశాల డీజీఎంవోల మధ్య ఈ నెల 10న జరిగిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమలైంది.
అయితే గడువు ముగుస్తుండటంతో మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఎన్ని రోజులు పొడిగిస్తారు అన్న విషయాన్ని వారు వెల్లడించ లేదు. రెండు దేశాల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయని ఇషాక్ దార్ తెలిపారు.