న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఫరూకాబాద్‌లో ఉన్న 125 ఏళ్ల క్రితం నాటి చరిత్రాత్మక శ్రీ గురు సింగ్ సాహెబ్ సాహిబ్ గురుద్వారా(Pakistan Gurdwara)ను కూల్చిన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల బీజేపీ స్పందించింది. సిక్కు మైనార్టీలకు పాకిస్థాన్ రక్షణ కల్పించడంలో విఫలమైనట్లు పేర్కొన్నది. బీజేపీ నేత అమిత్ మాల్వీయా తన ఎక్స్ అకౌంట్లో రియాక్ట్ అయ్యారు. ఇది కేవలం విధ్వంసం మాత్రమే కాదు అని, వ్యవస్థీకృత నిర్లక్ష్యమని.. పాకిస్థాన్‌లో ఉన్న సిక్కు వారసత్వ గుర్తులను కావాలనే ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ కపట వైఖరిని విస్మరించలేమన్నారు.
పాకిస్థానీ ఏజెన్సీలు స్థానిక స్కికులను భారత్‌పైకి రెచ్చగొడుతున్నాయని, మరో వైపు సిక్కు చరిత్ర, విశ్వాసం, గుర్తింపు ఆనవాళ్లను తుడిచి వేసే ప్రక్రియలో పాకిస్థాన్ ఉన్నట్లు ఆరోపించారు. పాకిస్థాన్ అనుసరిస్తున్న కుటిల్ ఎజెండా అందరికీ తెలుసు అని, సిక్కు మతస్తుల విశ్వాసాలు, వారసత్వాన్ని, హక్కులను కాపాడేది ఎవరో వారికి తెలుసు అన్నారు. పాకిస్థాన్‌తో పాటు ఆ ఆదేశానికి మద్దతు ఇస్తున్న భారత వ్యవస్థలు రాజకీయం నిర్వీర్యం అవుతాయని, పాక్ చేపట్టిన చర్య ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ సందేశం వెళ్తుందని భావిస్తున్నట్లు మాల్వీయా వెల్లడించారు.
పంజాబ్ ప్రావిన్సులోని ఫరూకాబాద్‌లో ఉన్న చరిత్రాత్మక గురుద్వారాను స్థానిక వ్యాపారి కూల్చివేశాడు. దీంతో సిక్కు వర్గ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ నుంచి ఎన్వోసీ లేకుండానే ఆ వ్యాపారి గురుద్వారాను కూల్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్ సీఎం మరియం నవాజ్ దీనిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సింగ్ సాహెబ్ గురుద్వారాను తక్షణమే మరమ్మత్తు చేయాలని పంజాబ్ మైనార్టీల శాఖ మంత్రి రమేశ్ సింగ్ అరోరా తెలిపారు.
Pakistan has failed its Sikh minorities yet again.
The 125-year-old historic Gurdwara Sri Guru Singh Sabha Sahib in Farooqabad, a protected heritage site, has been brazenly demolished. This is not merely an act of vandalism, it is a stark reminder of the systematic neglect and… pic.twitter.com/LhzUIoNK7q
— Amit Malviya (@amitmalviya) July 2, 2026