ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గాంలో(Pahalgam Terror Attack) మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్థాన్ స్పందించింది. ఆ ఉగ్రవాద దాడితో తమకు సంబంధం లేదని ఆ దేశం ప్రకటించింది. అన్ని రకాల ఉగ్రవాద చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని పాకిస్థాన్ వెల్లడించింది. పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. పెహల్గాం టెర్రర్ అటాక్‌తో పాకిస్థాన్‌కు ఎటువంటి లింకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నాగాలాండ్ నుంచి కశ్మీర్ వరకు వ్యతిరేకత ఉన్నదని, మణిపూర్‌లో కూడా అల్లర్లు జరుగుతున్నాయని, అక్కడ దేశీయ పరిస్థితులే పెహల్గాం దాడికి కారణమై ఉంటుందని పాక్ రక్షణ మంత్రి ఆరోపించారు.
నాగాలాండ్, మణిపూర్, కశ్మీర్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయని, చాలా మందిని ప్రభుత్వం వేధించడం వల్లే ఇలా జరిగిందన్నారు. ఉగ్రవాదాన్ని సపోర్టు చేయబోమని, ఉగ్రవాదులు స్థానికుల్ని టార్గెట్ చేయరాదు అని ఆసిఫ్ తెలిపారు. ఒకవేళ స్థానిక బలగాలు భారత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే, అప్పుడు పాకిస్థాన్‌ను టార్గెట్ చేయడం ఈజీ అవుతుందని ఆసిఫ్ వెల్లడించారు. పెహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆ ఘాతుకంపై పాకిస్థాన్ మంత్రి స్పందించారు.
We have absolutely nothing to do with it. We reject terrorism in all its forms and everywhere, says Pakistan’s Defence Minister Khawaja Asif on the #Pahalgam attack.#pahalgamattack pic.twitter.com/qGiTz6uVOn
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) April 23, 2025