పంజాబ్‌లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన బాంబు పేలుడు వెనుక పాక్ హస్తమున్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్ కేంద్రంగా ఉన్న ఖలిస్థానీ గ్రూపు హస్తం ఉందని అధికారులు అనుమానాలు వ్యక్త చేస్తున్నారు. ఈ పేలుడు ఐఈడీ పేలుడు కావొచ్చని పోలీసు ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాత్రూంలో బాంబును తయారు చేసే క్రమంలోనే బాంబు పేలి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్స్‌లోని బాత్రూంలో మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ పేలుడుతో బాత్రూం గోడ పూర్తిగా ధ్వంసమైంది. సమీపంలోని గదుల అద్దాలు కూడా పగిలిపోయాయి. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు.