న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వాఘా బోర్డర్(Wagah Border)ను మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. నేషనల్ సెక్యూటీ కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కశ్మీర్లో జరిగిన దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్.. అత్యవసరంగా ఎన్సీసీ మీటింగ్‌ను నిర్వహించింది. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ భేటీలో టాప్ సివిల్, మిలిటరీ నేతలు పాల్గొన్నారు. పెహల్గామ్ ఘటన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలకు కౌంటర్ ఇచ్చేందుకు రెఢీ అవుతున్నారు. పాక్ ప్రధాని కార్యాలయం తన ప్రకటనలో ప్రాంతీయ భద్రతా, జాతీయ భద్రతా పర్యావరణం గురించి పేర్కొన్నది. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. దీంతో వాఘా బోర్డర్‌ను మూసివేశారు.
పాక్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..
సింధూ జలాల ఒప్పందం రద్దును వ్యతిరేకించిన పాక్..
నీటి మళ్లింపును యుద్ధ చర్యగా భావిస్తాం..
వాఘా బోర్డర్ మూసివేత..
సార్క్ వీసా మినహాయింపులు భారత్‌కు రద్దు..
పాక్‌లో ఉన్న భారతీయులు 48 గంటల్లో వెళ్లిపోవాలి..
పాక్‌లో భారత హై కమీషన్ సభ్యుల సంఖ్య 30కి కుదింపు..
భారతీయ విమానాలకు తక్షణమే పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత..
భారత్‌తో అన్ని రకాల వాణిజ్యం నిలిపివేత..