న్యూఢిల్లీ డిసెంబర్ 12: టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయాన్ని తగ్గించే ఓజెంపిక్ డ్రగ్‌ను డానిస్ ఫార్మా సంస్థ నోవో నోర్డిస్క్ శుక్రవారం భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఒక నెలకు లేదా నాలుగు వారాలకు వాడవలసిన ఈ డ్రగ్ ప్రారంభ ధరను రూ. 8,800గా కంపెనీ నిర్ణయించింది. వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో ఈ డ్రగ్‌ను తీసుకోవలసి ఉంటుంది. సెమాగ్ల్లుటైడ్ ఫార్ములేషన్‌లో తయారైన ఈ డ్రగ్‌ని నియంత్రణలో లేని టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న రోగులు(పెద్దలు) వాడేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఇంజెక్షన్‌తోపాటు ఆహార నియమాలను పాటిస్తూ శారీరక వ్యాయామం కూడా చేయవలసి ఉంటుంది. 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ రూపాలలో డోసేజీ ఉంటుంది. ప్రాథమిక డోసు 0.25 ఎంజీ ధర రూ. 8,800 కాగా వరుసగా తర్వాతి డోసులు 0.5 ఎంజీ ధర రూ. 10,170, చివరి డోసు1 ఎంజీ ధర రూ. 11,175 ఉంటుంది. ప్రతి పెన్నులో నాలుగు వారాలు ఉపయోగించాల్సిన డోసేజీల డ్రగ్ ఉంటుంది. ఓజెంపిక్ని భారత్‌లో ప్రవేశపెట్టడాన్ని గొప్ప మైలురాయిగా నోవో నోర్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రీయ తెలిపారు. ైగ్లెసెమిక్ నియంత్రణతోపాటు బరువు తగ్గించడం, దీర్ఘకాల గుండె, మూత్రపిండాల రక్షణకు ఈ డ్రగ్ తోడ్పడుతుందని ఆయన చెప్పారు.