న్యూఢిల్లీ: సత్యా నికేతన్ బిల్డింగ్ ఓనర్ హరిరామ్ గుప్తాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని భివాడిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీలో ఆదివారం పీజీ హాస్టల్(Delhi Hostel) కూలిన ఘటనలో పోలీసులు హరిరామ్ గుప్తాను విచారిస్తున్నారు. అయిదు అంతస్తుల బిల్డింగ్‌లో బాయ్స్ పీజీ హాస్టల్ నడిపిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలో ఈ బిల్డింగ్ ఉన్నది. అయితే రిపేర్ వర్క్ జరుగుతున్న సమయంలో బిల్డింగ్ కూలింది. ఆ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిల్డింగ్ కండీషన్‌తో పాటు రిపేర్ వర్క్ జరిగిన తీరును కూడా విచారిస్తున్నారు.