కర్ణాటకలో మత్స్య పరిశ్రమ కుదేలు!
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కోతలు జాలర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. చేపల నిల్వ, రవాణాలో కీలకమైన ఐస్ ఉత్పత్తికి కరెంటు కోతల వల్ల ఆటంకం ఏర్పడటంతో మత్స్యకారులు తక్కువ రేటుకు చేపలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి జిల్లాల్లో కరెంటు కోతల ప్రభావం వల్ల ఐస్ ఫ్యాక్టరీలు, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
- కరెంటు కొరతతో పడిపోయిన ఐస్ ఉత్పత్తి
- చేపల రవాణా, ప్రాసెసింగ్‌కు తీవ్ర ఇబ్బందులు
- ఆదాయం తగ్గిందని జాలర్లు, పరిశ్రమల ఆవేదన
మంగళూరు, డిసెంబర్ 1: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కోతలు జాలర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. చేపల నిల్వ, రవాణాలో కీలకమైన ఐస్ ఉత్పత్తికి కరెంటు కోతల వల్ల ఆటంకం ఏర్పడటంతో మత్స్యకారులు తక్కువ రేటుకు చేపలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి జిల్లాల్లో కరెంటు కోతల ప్రభావం వల్ల ఐస్ ఫ్యాక్టరీలు, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ‘ఆగస్టు నుంచి కరెంటు సంక్షోభం కొనసాగడం వల్ల ఐస్ ఫ్యాక్టరీలు కేవలం 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి’ అని కరావళి మీనుగరర క్రియా సమితి సభ్యుడు హరీష్ సాలియన్ అన్నారు. కరెంటు సంక్షోభం వల్ల ఒమేగా-3 ఆయిల్ ఎక్కువగా ఉండే సాైర్డెన్ చేపలను భారీ స్థాయిలో ఐస్‌లో నిల్వ చేసి విలువ జోడింపు ప్రాసెసింగ్ యూనిట్లకు జాలర్లు తరలించలేకపోతున్నారు. రూ.160-180 ధర పలికే ఈ చేపలను రూ.100-120లకు ఫిష్ మీల్ పరిశ్రమలకు అమ్ముకుంటున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లకు చేపలను తరలించేటప్పడు ఐస్ లేని పరిస్థితుల్లో జాలర్లు గత్యంతరం లేక వాటిని ప్రాసెసింగ్ యూనిట్లు చెల్లించే ధర కంటే 60 శాతం తక్కువ ధరకు స్థానికంగా అమ్ముకోవాల్సి వస్తున్నది.
165 ఐస్ ప్లాంట్లపై ప్రభావం
కరెంటు కోతల వల్ల తీర ప్రాంతంలో 165 ఐస్ ఫ్యాక్టరీలపై ప్రభావం పడింది. రోజుకు 2,200 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ ఫ్యాక్టరీలు ప్రస్తుతం రోజుకు 1900 టన్నుల ఐస్‌ను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. ఐస్ కొరత ప్రాసెసింగ్ యూనిట్లపైనా ప్రభావం చూపిస్తున్నది. డీజిల్ జనరేటర్లతో యూనిట్లను నడిపితే తక్కువ లాభాలు వస్తున్నాయని దక్షిణ కన్నడ ఐస్ ప్లాంట్స్ సహకార సంఘం డైరెక్టర్ మోహన్ బెంగ్రే తెలిపారు. చిన్న జాలర్ల బృందాలు, సహకార సంఘాలు జనరేటర్ల ద్వారా తమ ఫ్యాక్టరీలను నడిపించే స్థితిలో లేరని జాలర్ల నాయకులు తెలిపారు. దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో ఏటా 80 వేల టన్నుల చేపలను పడతారు. వాటిలో 30 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి చేస్తారు. కానీ ఐస్ తగినంత లభించక ఎగుమతులకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

