లక్నో: అత్తింటి వారితో వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు తనను వేధిస్తున్నారని అతడు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిప్పంటించుకున్నాడు. (Man Sets On Fire) వెంటనే స్పందించిన పోలీసులు మంటలను అర్పివేశారు. తీవ్రంగా కాలిన గాయాలైన అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నై సరై ప్రాంతానికి చెందిన గల్ఫామ్కు భార్యతో విభేదాలున్నాయి. దీంతో ఆమె తన పుట్టింట్లో నివసిస్తున్నది. డిసెంబర్ 30న అతడు తన అత్తవారింటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో బావ భార్య ఆ వ్యక్తిపై వేధింపుల కేసు పెట్టింది.
కాగా, అత్తింటి వారితో వివాదం నేపథ్యంలో పలు కేసులున్న గల్ఫామ్, బుధవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు పరుగున అతడి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా కాలిన గాయాలైన అతడ్ని తొలుత జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బరేలీలోని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు అత్తమామలు తనను బంధించారని, మొబైల్ ఫోన్, డబ్బు, ఈ-ఆటోను లాక్కున్నారని గల్ఫామ్ ఆరోపించాడు. తనపై పలు కేసులు నమోదు చేయడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిటీ సర్కిల్ ఆఫీసర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే తనను వేధిస్తున్నారని అతడు వాపోయాడు. కాగా, ఆ యువకుడు నిప్పంటించుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश : जिला बदायूं में SSP दफ्तर के गेट पर गुलफाम ने खुद को आग लगाई। पुलिस ने आग बुझाकर हॉस्पिटल में भर्ती कराया।
गुलफाम ने बताया– 2 दिन पहले मुझसे ई रिक्शा, 2200 रुपए छीन लिए गए। पुलिस ने FIR नहीं की। CO ने डोडा लगाकर जेल भेजने की धमकी दी।
वहीं, पुलिस का कहना है कि… pic.twitter.com/TiIbzgN0e8
— Sachin Gupta (@SachinGuptaUP) January 1, 2025