న్యూఢిల్లీ: చిత్తరంజన్ జాతీయ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రెండవ క్యాంపస్‌ను వర్చువల్ రీతిలో ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కోవిడ్ టీకాలు అర్హులైన జనాభాలో.. 90 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకానైనా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. గడిచిన అయిదు రోజుల్లో 15 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న సుమారు 1.5 కోట్ల మంది చిన్నారులకు టీకాలు ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు. మోకాలి ఇంప్లాంట్స్ ధరలను తగ్గించినట్లు చెప్పారు. దాని వల్ల సీనియర్ సిటిజెన్ల ఎక్కువ లద్ది పొందినట్లు వెల్లడించారు. దీని వల్ల 1500 కోట్ల భారం తగ్గిందన్నారు. పీఎం నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ ద్వారా 12 లక్షల మంది పేదలకు ఉచితంగా డయాలసిస్ అందించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.