న్యూఢిల్లీ : రేబిస్తో మన దేశంలో నేటికీ ఏటా 5,700 మందికిపైగా మరణిస్తున్నారు. దేశవ్యాప్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ (ఎన్ఐఈ) తెలిపింది. 15 రాష్ర్టాల్లోని 60 జిల్లాల్లో ఈ సర్వే జరిగినట్లు వెల్లడించింది. ఏటా దాదాపు 91 లక్షల మందిని జంతువులు కరుస్తున్నాయని తెలిపింది.
బాధితుల్లో 14 ఏళ్లలోపు బాలలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. కుక్క కాటు బాధితుల్లో 80 శాతం మందికిపైగా కనీసం ఒకసారి అయినా రేబిస్ నిరోధక టీకాను వేయించుకున్నారని తెలిపింది.