శ్రీనగర్: ఈ శీతా కాలంలో జమ్ము కశ్మీర్‌కు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. 30 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు జమ్ములో సంచరిస్తున్నట్టు సైన్యానికి సమాచారం అందింది.
చిల్లాయ్ కలాన్‌గా పిలిచే తీవ్రమైన చలి వాతావరణం ఉండే 40 రోజుల సీజన్లో ఉగ్రవాదులు జనావాస ప్రాంతాల్లోకి చొచ్చుకు రాకుండా ఉండేందుకు వారిని కట్టడి చేయాలని సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. కిష్టార్, దోడా జిల్లాలోని కొండ ప్రాంతాల్లో ప్రజలు తక్కువగా నివసించే చోట ఉగ్రవాదులు తిష్ఠ వేసి ఉంటారనే అనుమానంతో ఆయా ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసింది.