లూథియానా, మార్చి 4 : బుధవారం రైతు సంఘాల నాయకులు ‘చండీగఢ్ చలో’కు పిలుపునివ్వటంతో.. పంజాబ్లో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు చెందిన పలువురు నాయకుల్ని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నుంచి వారి ఇండ్లపై దాడులు చేసి మరీ వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో పంజాబ్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆప్ సర్కార్ తీరుపై రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. 37 రైతు సంఘాల ఐక్య వేదిక ‘ఎస్కేఎం’ బుధవారం ‘చండీగఢ్ చలో’కు పిలుపునిచ్చింది.